పుష్కర యాత్రికులకు మహా అన్నదానం, మంచి నీటి సౌకర్యం
కాటారం, తెలంగాణ జ్యోతి : ప్రసిద్ధ శైవ క్షేత్రం.. దక్షిణ కాశీగా పేరు అందిన కాలేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో మంథని శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల ఆదేశాలతో మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుష్కర యాత్రికుల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాటారంలో మహా అన్నదానం, గారేపల్లి చౌరస్తాలో పులిహోర పొట్లాల పంపిణీ, మహదేవపూర్ లోని పలు ప్రదేశాల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పించారు. ప్రజలు పుష్కర స్నానం చేసి పుణ్యఫలం పొందాలని గ్రామాలలో ఉచిత బసౌకర్యం కల్పించడంతో ప్రజలు పుష్కరస్నానానికి తరలి వెళ్తున్నారు. పుష్కర యాత్రికులు అన్నదాత సుఖీభవ అంటూ దీవిస్తున్నారు. మంథని నియోజకవర్గంలోని గ్రామాలకు పుష్కర స్నానం కోసం కాలేశ్వరం వెళ్లేందుకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం పట్ల మంత్రి శ్రీధర్ బాబును ప్రజలు అభినందిస్తున్నారు. శ్రీధర్ బాబు ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందన చేయమని ప్రజలు పేర్కొంటున్నారు.