స్ధానిక సంస్థల ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాల కొకసారి మారాలి

స్ధానిక సంస్థల ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాల కొకసారి మారాలి

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎమ్మార్పీఎస్ , ఎంఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశం   మండల అధ్యక్షులు పడిదల సతీష్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా వావిలాల స్వామి మాదిగ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము స్థానిక సంస్థల రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు ఉండాలని చేసిన జీవోను వ్యతిరేకిస్తు న్నామన్నారు. భారత రాజ్యాంగం ప్రకారము జనాభా నిష్పత్తిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఐదు సంవత్సరాలకు రిజర్వేషన్ల ప్రక్రియల మార్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న జనరల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ బీసీలకు రొటేషన్ సిస్టం లో రిజర్వేషన్ల ప్రక్రియను జనాభా నిష్పత్తి అనుగు ణంగా స్థానిక సర్పంచులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పరికి మహేష్ మాదిగ, ఎమ్మెస్పి కన్నాయిగూడెం మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగ, చిందు చిరంజీవి, కర్నే గోపి మాదిగ తదితరులు పాల్గొన్నారు.