గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలి
– ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పించిన కార్యదర్శులు
ఏటూరునాగారం, తెలంగాణజ్యోతి: మండల పరిధి గ్రామా ల్లో రోజువారి కార్యకలాపాలకు నిధులు లేక పంచాయతి కార్యదర్శులు ఆర్ధికంగా, మానసికంగా పలు సమస్యలకు గురవుతున్నారని ఏటూరునాగారం మండలంలోని పంచా యతి కార్యదర్శులు ఎంపిడిఓ రాజ్యలక్ష్మికి మొరపెట్టుకు న్నారు. రానున్న బతుకమ్మ, దసరా పండుగలకు గ్రామపంచా యతీల ద్వారా పలు కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుం దన్నారు. ఇప్పటికే ఖర్చుపెట్టిన డబ్బులకు ఐఎఫ్‌ఎమ్‌ఎస్ ద్వారా పేమెంట్ చేసిన చెక్కులు 10 నెలలుగా క్లియరెన్స్‌కు నొచుకోలేదన్నారు. దీంతో గ్రామపంచాయతీకి ఏ ఒక్క ఏజెన్సీ గాని, ఫర్మ్‌గాని, ఏ ఇతర షాపుల యజమానులు కూడా సహకరించడం లేదన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందికి కూడా కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొం దన్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శిలు వారి జీతం నుంచీ ఖర్చులను భరిస్తు కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ విషయాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకెట్లి పంచాయతీల కు నిధులు మంజూరయ్యేలా చూడాలని వినతిపత్రాన్ని అం దచేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రమా దేవి, హసీన బేగం, లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు