ములుగులో మద్యం సిండికేట్ దందా ..!

ములుగులో మద్యం సిండికేట్ దందా ..!

ములుగులో మద్యం సిండికేట్ దందా ..!

– చోద్యం చూస్తున్న అధికారులు..?

         ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా కేంద్రంలో మద్యం సిండికేట్ వ్యాపారుల దందా ఇష్ట రాజ్యాంగ కొనసాగుతోంది. వైన్ షాపుల్లో వినియోగదారులకు ఎమ్మార్పీ ధరలకు విక్రయించకుండా 5షాపుల నిర్వాహకులు సిండికేట్ గా ఏర్పడి మద్యాన్ని బెల్ట్ షాపులకు తరలిస్తు న్నారు. ములుగు మండలంలోని వివిధ గ్రామాలకు ఆటోలో మద్యం తరలిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తు న్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టింపులేకుండా వ్యవహ రిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం కల్తీ అవుతున్నట్లు ఆరోపణలు సైతం వినిపిస్తు న్నాయి. బెల్ట్ షాపులకు రూ.20 నుంచి రూ 40 అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిదులు ఈ వ్యవహారంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక ఆటోలను ఏర్పాటు చేసి సిండికేట్ గోదాం నుంచి మండలంలోని వివిధ గ్రామా లకు ప్రత్యేకంగా తరలిస్తున్నారు. ధనార్జన ధ్యేయంగా సిండి కేట్ వ్యాపారుల దందా కొనసాగుతూ ఉండడంతో సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బెల్ట్ షాపుల నిర్వాహకులకు సైతం ఏదైనా సమస్య వస్తే తాము అండగా ఉంటామని సిండికేట్ వ్యాపారులు భరోసా ఇస్తున్నారు. ఇటు ఎక్సైజ్ అటు పోలీసు అధికారులతో లోపాయి కారి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.