మొక్కలను కాపాడుకుంటాం – నరసింగాపూర్ విద్యార్థులు

మొక్కలను కాపాడుకుంటాం – నరసింగాపూర్ విద్యార్థులు

వెంకటాపూర్ , తెలంగాణ జ్యోతి : స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అధికారులు, విద్యార్థులు శుక్రవారం వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశా ల ఆవరణలో మొక్కలు నాటారు . విద్యార్థులు మొక్కలను కాపాడుకుంటామని ఆ మొక్కలకు వారి తల్లిదండ్రుల పేర్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయు లు ముహమ్మద్ సర్వర్ అహ్మద్ మాట్లాడారు. చెట్ల తోనే వాతావరణ సమతుల్యత ఉంటుందని, గ్రామంలోని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. గ్రామంలో స్వచ్ఛ ధనం పచ్చదనం అనే వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో అధికారులు, విద్యార్థులు మొక్కలు నాటామని అన్నారు. వనాలు మానవా మనుగడకు ఎంతో అవసరం అన్నారు. ప్రతి ఒక్కరు విధిగా ముక్కలు నాటాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటి వాటికి తల్లిదండ్రుల పేర్లు పెట్టి ప్రతిరోజు నీళ్ళు పోసి కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి వో అధ్యక్షురాలు పొలం లక్ష్మీప్రసన్న, పంచాయతీ కార్యదర్శి అనిత, అంగ న్వాడి టీచర్ ఎర్రబెల్లి సరోజన, కారోబార్ కార్తీక్, అంగన్వాడి ఆయా భవాని, గ్రామపంచాయతీ సిబ్బంది స్వామి గ్రామ స్తులు తదితరులు పాల్గొన్నారు.