ఐటిఐ కి డ్యూయల్ డెస్క్ ల వితరణ
– శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ వెల్లడి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా మంథని నియోజకవర్గం లోని కాటారం ఐటిఐ కళాశాల విద్యార్థులకు అనుకూలంగా ఉండే డ్యూయల్ డెస్క్ టేబుల్ లను అందజేయనున్నట్లు శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు వెల్లడించారు. శుక్రవారం శ్రీనుబాబు ను మంథని లో కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపాల్ బిక్షపతి, స్టాఫ్ సతీష్, పార్టీ నాయకులు ఆత్మకూరి కుమార్, భూపెళ్లి రాజు లు కలిశారు. ఐటిఐ కాలేజీలో సమస్యలను ప్రిన్సిపాల్ బిక్షపతి వివరించారు. ఈ సందర్భంగా ఐటిఐ కాలేజీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను త్వరలోనే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని శ్రీను బాబు అన్నారు.