ఎన్నికలలో గొడవలు జరిగితే ఖబర్దార్
ఎన్నికలలో గొడవలు జరిగితే ఖబర్దార్
- ఎస్సై అభినవ్ హెచ్చరిక
తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: రానున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో గొడవలు జరిగితే అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కాటారం ఎస్సై అభినవ్ హెచ్చరించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ప్రజలు, పలు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. గతంలో జరిగిన ఎన్నికల గొడవలలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. గత ఎన్నికలలో గొడవలకు బాధ్యులైన వారిని తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై అభినవ్ వెల్లడించారు.