మహారాష్ట్ర పూణేలో జాతీయ సేవా రత్న అవార్డు అందుకున్న కాటారం యువకుడు
మహారాష్ట్ర పూణేలో జాతీయ సేవా రత్న అవార్డు అందుకున్న కాటారం యువకుడు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: మహారాష్ట్ర పూణేలో బహుజన సాహిత్య అకాడమీ నిర్వహించిన 4th వెస్ట్రన్ ఇండియా కాన్ఫరెన్స్ ( 4వ పశ్చిమ భారతదేశ కాన్ఫరెన్స్ ) కార్యక్రమంలో కాటారం గ్రామ నివాసి, స్వయంకృషి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు కొట్టే సతీష్ జాతీయ సేవా రత్న అవార్డు అందుకున్నారు. విదేశాలలో ఉన్నత విద్య , స్వదేశం లో గ్రామీణ అభివృద్ధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సొంత ఊర్లో స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు కొట్టే సతీష్ కి జాతీయ సేవా రత్న అవార్డు ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మ ఫెమ్ సింగర్ రాంబాబు చేతుల మీదుగా సతీష్ అవార్డు అందుకోవడం జరిగింది.ఈ అవార్డు అందు కున్న తర్వాత తనమీద ఇంకా బాధ్యత పెరిగిందని కొట్టే సతీష్ తెలియజేశారు.