రావి ఆకుపై నరేంద్ర మోడీ చిత్రపటం
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం, ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన ఆర్ట్ టీచర్ రమేష్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ‘కార్వింగ్ ఆర్ట్’ ద్వారా రావి ఆకుపై నరేంద్ర మోడీ చిత్రపటం, కమలం పువ్వు గీసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.