అంబేద్కర్ విగ్రహానికి పూల మాలల వేసిన ఆదివాసీ సంఘాల జె ఏ సి

అంబేద్కర్ విగ్రహానికి పూల మాలల వేసిన ఆదివాసీ సంఘాల జె ఏ సి

అంబేద్కర్ విగ్రహానికి పూల మాలల వేసిన ఆదివాసీ సంఘాల జె ఏ సి

– 5,6 షెడ్యూల్స్ పటిష్టం గా అమలు చేయాలని డిమాండ్ చేసిన ఆదివాసీ సంఘాలు.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : భారత రాజ్యాంగం ఆమోదించ బడి నేటికీ 75 వసంతాలు అయినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదని, ములుగు జిల్లా వెంకటాపురం మండల ఆదివాసీ సంఘాలు ఆరోపించారు. మంగళవారం మినీ రాజ్యాంగమయిన ఐదో షెడ్యూల్డ్ పాలకుల నయవంచ న విధానాల కారణంగా అమలుకు నోచుకోవడం లేదని ఆదివాసీ జే. ఏ. సి పేర్కొంది. మంగళవారం ప్రభుత్వ విశ్రాంతి భవనం లో ఆదివాసీ జే ఏ సి ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న అమోందించినట్టు ఆదివాసీ జె ఏ సి నాయకులు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని పాఠశాల స్థాయి నుండే పౌరులకు భోదించాలని పాలకులను కోరారు. దేశంలో రాజ్యాంగ పుట్టుకే ఒక సవాలు అన్నారు. దేశంలోని మనువాదుల ను ఎదిరించి న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బలమైన రాజ్యాంగాన్ని రూపొందించి నట్లు తెలిపారు. దేశాన్ని శతాబ్దాలుగా పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలైన బాల్య వివాహాలు, సతీ సహగమనం,వెట్టి చాకిరి, సంఘ బహిష్కరణ లేక వెలి,జోగిని వ్యవస్థ,కుల వ్యవస్థ, అంటరాని తనం,బాల కార్మిక వ్యవస్థలను భారత రాజ్యాంగం అంత మొందించిందని వారు పేర్కొన్నారు.భారత రాజ్యాంగం లోని, ఐదు ఆరు షెడ్యూల్స్ రూపొందించు టకు రాజ్యాంగ కమిటీ సభ్యులు అయిన డాక్టర్ జై పాల్ సింగ్ ముండా, కూడా ఒక ప్రధాన కారణం అన్నారు. భారత రాజ్యాంగం లోనే మరో మినీ రాజ్యాంగం గా చెప్పబడుతున్న ఐదో షెడ్యూల్ గిరిజన, ప్రజా ప్రతినిధుల లోప భూయిష్ట విధానాల వల్ల అమలుకు నోచుకోవడం లేదని దుయ్య బట్టారు . గిరిజన ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తున్నారు అని మండిపడ్డారు. గిరిజన భూముల అన్యా క్రాంతం అవుతున్న, వలసలు పెరిగి, గిరిజన సంపద కొల్ల గోడుతున్నా ఎందుకు నోరు మేద పడం లేదని నిలదీశారు. గిరిజన సలహా మండలి ఏర్పాటు ఎందుకు చేయడం లేదో ప్రజలకు సమాదానం చెప్పాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేసాయి. దేశంలో ని పది కోట్ల ఆదివాసీల అస్థిత్వం అభివృద్ధి బలి పీఠం పైన వేలాడు తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. నేటికీ బడి, రోడ్లు లేని గ్రామాలు అనేకం ఉన్నాయన్నారు. వైద్యం, విద్య, ఉపాధి అవకాశాలు లేక దుర్భారమైన జీవితం గడుపుతున్నట్లు తెలిపారు. నేడు భారత రాజ్యాంగం పెను సవాళ్లు ఎదుర్కొం టున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గొప్పతనం గురించి, ప్రతి ఒక్కరు తెలుసు కోవాలని ప్రజల కు విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఉయిక శంకర్, గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి, ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి, తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి సిద్దబోయిన సర్వేష్, జీఎస్పీ జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షులు ప్రతాప్, మహేష్, గోపినాధ్, ఉయిక గోపి, విజయ్, ఇర్ప రాజు, నారాయణ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు..