అంతర్జాతీయ బాలల దినోత్సవం
అంతర్జాతీయ బాలల దినోత్సవం
తెలంగాణ జ్యోతి,కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండ లం ఆశ్రమ ఉన్నంత పాఠశాలలో బుధవారం అంతర్జాతీయ బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భం గా ఉపాధ్యాయుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… నవంబర్ 20, 1989న బాలల హక్కులపై కన్వెన్షన్ ను ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిందని, ఇట్టి ప్రత్యేక రోజు ను అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంగా జరుపుకుం టున్నారన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల ఓడంబడిక ను భారతదేశం డిసెంబర్ 11, 1992 నాడు అంగీకరించిందని అన్నారు. తదనగుణంగా పిల్లలు హక్కుల రక్షణకై భారతదేశం పిల్లల హక్కుల పరిరక్షణ కమిటీ చట్టం జనవరి 26 నాడు అమలకు తెచ్చిందని, బాలలందరూ వారి యొక్క హక్కులు సంపూర్ణంగా పెంపొందేలా కృషి చేస్తామని, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ చేయాలని కోరారు.దీంతో విద్యార్థులు,ఉపాద్యాయులు, బాల ల హక్కులపై ప్రతిజ్ఞ చేశారు. అంతేకాకుండా పదవ తరగతి చదువుతున్నా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.ఈకార్యక్రమంలో పాఠశాల తాత్కాలిక ప్రధానో పాధ్యాయులు మంకిడి రాజశేఖర్, కోటయ్య, తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.