వెంకటాపురంలో ఘణంగా సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు.
వెంకటాపురంలో ఘణంగా సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణజ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రం మెయిన్ రోడ్డులోని సిపిఐ పార్టీ జెండా దిమ్మె వద్ద 99 వ సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్స వాన్ని ఘణంగా నిర్వహించారు. ఈ సందర్బంగా, పార్టీ జెండా ను సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లిఖార్జునరావు ఎగురవే శారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కార్మికుల, కర్షకుల, శ్రామికుల సమస్యలపై గళమెత్తి సాటి న భారత కమ్యూనిస్టుపార్టీ పాలక పార్టీలతో పోరాటాలే ధ్యేయంగా నిరంతరం పేదల పక్షాణ ప్రజా సమస్యలపై పోరాటాలు తో సిపిఐ పార్టీ ముందు వున్నదని అన్నారు. కార్మిక శక్తి మిత్ర పక్షా ల ఐక్యత ముందు, డబ్బు ఏమాత్రం పనిచేయలేదు. అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలముందు సిపిణ నాయకుడు కామ్రేడ్ సాంబ శివరావు గెలుపొందడం గర్వకారణ మని తెలిపారు. ఇక ముందు కూడా ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతామని ఈ సందర్ బంగా తెలియజేసినారు. వాజేడు మండ లం, ఏటూరునాగారం మండలం, మంగపేట మండలంలో కూడ పార్టీ జెండాల ఆవిష్కరణలు జరిపినట్లు సిపిణ జిల్లా కార్యదర్శి టి .మల్లిఖార్జున రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆచంట ప్రసాద్ , రవీందర్, బి. నర్సింహారావు , జి రాము, కట్ల రాజు సంఖ్య ఆ దినారాయన, బొల్లె నర్సింహారావు, గొడిశాల నాగే శ్వరి, నాగమ్మ , ఎండీ నాసర్ , త్రినాద్ కోడాలి కృష్ణ , వెంకట్ తదితర కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.