వైభవంగా అయ్యప్పస్వామి శోభయాత్ర
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : కాటారం మండల కేంద్రం లో అయ్యప్ప మాలధారణ స్వాములు.. అయ్యప్పస్వామి శోభా యాత్ర కన్నుల పండుగ నిర్వహించారు స్థానిక శ్రీ ఆనంద ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ మూర్తీని ఊరేగింపు కార్యక్రమాన్ని వైభోపితంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారిని స్వాగతం పలుకు తూ స్వామిని దర్శించుకోని వేడుకున్నారు..మాలధారణ స్వాముల నృత్యల తో శరణ ఘోషతో కాటారం పురవీధుల్లో ఊరేగింపు చేసి అనంతరం పవిత్ర శైవక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం త్రివేణి సంఘమంలో స్వామి వారికి జలాభిషేకం తో ప్రత్యేక విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి భాను ప్రసాద్ శర్మ, ఆలయ వ్యవస్థాపకులు బచ్చు అశోక్ గుప్తా, ఆలయ కమిటీ అధ్య క్షులు బచ్చు ప్రకాష్, గురుస్వాములు పిచర రామకృష్ణ రావు, బొమ్మ ప్రభాకర్, అయిత వెంకన్న, చీమల రాజు, జక్కు మొగిలి, ముస్కామల్ల సత్యనారాయణ, జక్కు రాకేష్, మేకల అశోక్, గద్దె రవీందర్,దండ్రు రాజయ్య,కొట్టె ప్రభాకర్, పసుల మొగిలి తది తరులు మలాధారణ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు..
1 thought on “వైభవంగా అయ్యప్పస్వామి శోభయాత్ర”