ప్రభుత్వ భూమిలో అక్రమంగా గ్రావెల్ త్రవ్వకం

ప్రభుత్వ భూమిలో అక్రమంగా గ్రావెల్ త్రవ్వకం

ప్రభుత్వ భూమిలో అక్రమంగా గ్రావెల్ త్రవ్వకం

– జె.సి.బి. సీజ్, రూ. 50 వేల  జరిమాన

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం  ప్రభుత్వ భూములలలో ఎటు వంటి అనుమతులు లేకుండా జెసిబి ద్వారా గ్రావెల్ తరలి స్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో వెంకటాపురం రెవిన్యూ శాఖ అప్రమత్తమై తహసిల్దార్ జెసిబిని సీజ్ చేశారు. ఈ నెల ఏడో తేదీన చొక్కాల ప్రాంతంలో ప్రభుత్వ భూములలో అక్రమంగా గ్రావెల్ తీస్తున్నట్లు నమ్మదగిన సమాచారంతో దాడులు నిర్వహించి జెసిబిని సీజ్ చేసి మైన్స్, జియాలజీ శాఖకు నివేదిక పంపించారు. ఈమేరకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్అండ్ జియాలజీ శాఖ జెసిపి యజమాని, కాంట్రా క్టర్ 50 వేల రూ. విధించగా,  సంబంధిత శాఖకు 50 వేల రూపాయల పెనాల్టీని చెల్లించారు. ఈ మేరకు సీజ్ చేసిన జెసిబిని మంగళవారం విడుదల చేశారు. మండల తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య మాట్లాడుతూ అనుమతులు లేకుండా ప్రభు త్వ భూములలో అక్రమంగా గ్రావెల్,  ఇతర ఖనిజాలను తర లిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నా రు. ఆయా యంత్రాలను, జెసిబిలను, లారీలను, టాక్టర్లను, సీజ్ చేయటం జరుగుతుందని తాసిల్దార్ లక్ష్మీరాజయ్య మీడి యాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.