బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాలి

బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాలి

బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాలి

– హిందూ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ

ములుగు ప్రతినిధి : పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిలవురింప జేయాల ని, మైనారిటీలుగా ఉన్న హిందువులను రక్షించాలని హిందూ పరిరక్షణ వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం ములుగులోని జాతీయ రహదారిపై విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులు సేవ్ హిందూ ఇన్ బంగ్లాదేష్ పేరిట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లా దేష్ లో హిందువులపై అనేక దాడులు జరుగుతున్నా ప్రపంచ దేశాలు చోద్యం చూస్తున్నాయన్నారు. హిందువులను రక్షించా లని, దాడులను ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ పరిరక్షణ వేదిక నాయకులు ముక్కు సుబ్బారెడ్డి, రవిరెడ్డి, దిలీప్, సుంచు రమేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొంబ బలరాం, నాయకులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, రాయంచు నాగరాజు, ఆవుల ప్రశాంత్ రెడ్డి, సల్పాల శ్రీనివాస్, బాషబోయిన మహేందర్, రాజ్ కుమార్, శేషు, ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి బాబురావు, గాదం కుమార్, వేణు, మధుసూదన్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.