ములుగులో ఫీవర్ సర్వే

Written by telangana jyothi

Published on:

ములుగులో ఫీవర్ సర్వే

– విషజ్వరాలు ప్రబలుతుండటంతో ఆరోగ్యశాఖ చర్యలు

ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలో విషజ్వరాలు ప్రబలుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఆయా కాలనీల్లో గ్రూపులుగా ఏర్పడి వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా అనారోగ్యం ఉంటే వెంటనే ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. ములుగులోని క్రిష్ణాకాలనీలో మంగళవారం సబ్ సెంటర్ వైద్యాధికారిని జె.నవ్య ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేశారు. బీపీ, షుగర్, మలేరియా టెస్టులు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 20 రోజు లుగా సుమారు 2వేలమందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిం చిన ట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సీహెచ్. నర్సమ్మ, ఆశాలు రజిత,రమ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment