అధిక ఇసుక లోడు, అతి వేగంతో వెళ్తున్న లారీ పట్టివేత

అధిక ఇసుక లోడు, అతి వేగంతో వెళ్తున్న లారీ పట్టివేత

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండ లం జాతీయ రహదారిపై గుమ్మడిదొడ్డి గ్రామ సమీపంలో అధిక ఇసుకలోడుతో పాటు అతివేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వస్తున్న లారీని వాజేడు పోలీసులు వెంటాడి పట్టుకు న్నారువాజేడు మండ లం జాతీయ రహదారిపై గుమ్మడిదొడ్డి గ్రామ సమీపంలో అధిక ఇసుకలోడుతో పాటు అతివేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వస్తున్న లారీని వాజేడు పోలీసులు వెంటాడి పట్టుకు న్నారు. ఈ మేరకు వాజేడు సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్ మీడియాకు వివరాలను విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం వాజెడు పోలీసులు గుమ్మడిదొడ్డి గ్రామ శివారు లో, వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా , ఒక లారీ అధిక ఇసుక లోడుతో, అతి వేగంగా రహదారిపై ప్రజలకు హాని కలిగించే విధంగా, వస్తుండగా అట్టి లారీలను వెంబడించి పట్టుకొన్నారు. నడుపుతున్న లారి డ్రైవర్ ను పట్టు కొన్నారు. అతని వివరాలను అడిగి తెలుసుకోగా శ్యామకూర మధు వెలిమినేడు గ్రామం, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా అని తెలిపారు. అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు వాజేడు ఎస్.ఐ. ఆర్.హరీష్ తెలిపారు.