నిబంధనలు ఉల్లంఘించి గ్రావెల్ తవ్వకం
నిబంధనలు ఉల్లంఘించి గ్రావెల్ తవ్వకం
– పర్మిషన్ రద్దు చేసిన రెవెన్యూ అధికారులు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం వి ఆర్కే పురం పంచాయతీ చొక్కాల గోదావరి ఇసుక ర్యాంపుకు రోడ్లు పోసేందుకు పొంది న గ్రావెల్ పర్మిషన్ ను ఉల్లంఘించి తోలకాలు చేపట్ట డంతో వెంకటాపురం మండల తాసిల్దార్ లక్ష్మీరాజయ్య పర్మిషన్ రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ ములుగు జిల్లా నుండి గ్రావెల్ తోలకం నిమిత్తం ఇసుక సొస్సటి అనుమతులు తీసుకున్నా రు. అయితే పర్మిషన్లకు వ్యతిరేకంగా వీరభద్రవరం (జడ్) నుండి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులను అతిక్రమిం చి గ్రావెల్ తోలుతున్నట్లు గుర్తించడంతో పర్మిషన్ ను రద్దు చేస్తున్నట్లు తాసిల్దార్ లక్ష్మీరాజయ్య మీడియాకి విడుదల చేసిన ప్రకటనలలో తెలిపారు. ఈ మేరకు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తాసిల్దార్, రెవెన్యూ సిబ్బంది గ్రావెల్ తోలుతున్న ప్రాంతానికి వెళ్లి నిలిపివేశారు. తదుపరి అనుమ తులు వచ్చే వరకు గ్రావెల్ తీయవద్దని, అక్రమంగా గ్రావెల్ తీస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని ఈ సంద ర్భంగా మండల తాసిల్దార్ సంబంధిత వారికి తెలిపారు.