ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, నిజాం నిరంకుశ వ్యతిరేక నేత, తెలంగాణ తొలి, మలి దశ పోరాట దీశాలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూ జీ 109వ జయంతి వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. కాటారం మండల పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. అనం తరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పేదలకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో కాటారం డి.ఎస్.పి గడ్డం రామ్మోహన్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈఊరి నాగార్జున రావు, సబ్ ఇన్స్పెక్టర్ మ్యాక అభినవ్, ఎంపీడీవో అడ్డూరి బాబు, ఎం పి ఓ వీరస్వామి, మాజీ ఎంపీపీ సంతకాని సమ్మయ్య, మాజీ ఎంపీటీసీలు జాడి మహేశ్వరి, రవీందర్ రా, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం కొమరయ్య, ఆత్మకూరి కుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి, లతోపాటు కాటారం మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దోమల సమ్మయ్య, మాచర్ల రాజేం దర్, కొండా వెంకటేశ్వర్లు, గాదె రమేష్, వలుస వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎలుబాక సుజాత, దాసరి గట్టయ్య, అందే సత్యనా రాయణ, పిల్లమారి రమేష్, యెలుగం సత్యనారాయణ, అమృతం సంతోష్, యెలుగం రాజనారాయణ, దానం మొగిలి, యెలుగం రవి, దేవరపల్లి కుమారస్వామి, పలనాటి బలరాం, దోమల రాజశేఖర్, మాచర్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.