బదిలీపై వెళ్తున్న డి సి సి స్టాఫ్ అసిస్టెంట్ కు సన్మానం

Written by telangana jyothi

Published on:

బదిలీపై వెళ్తున్న డి సి సి స్టాఫ్ అసిస్టెంట్ కు సన్మానం

ములుగు ప్రతినిధి: జిల్లా కేంద్రంలో గల డిసిసి బ్యాంక్ నందు 5 సంవత్సరాలు స్టాప్ అసిస్టెంట్ గా పని చేసి బదిలీ పై వెళ్తు న్న గందె స్రవంతిని గురువారం మణిదీప్ హౌసింగ్ సొసైటీ సభ్యులు సన్మానించారు. ములుగులో వృత్తి రీత్యా ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తంచి వరంగల్ సెంట్రల్ బ్యాంక్ కి బదిలీపై వెళ్తున్న సందర్భంగా డిసిసి బ్యాంక్ సిబ్బంది, బ్యాంకు ఖాతాదారులు, మణిదీప్ గ్రూప్ సభ్యులు గందె స్రవంతి సేవలను కోనియాడారు. ఈ సందర్భంగా మణిదీప్ హౌసింగ్ సోసైటి అదక్ష్యులు గండ్రకోట కుమార్ మాట్లాడుతూ ములుగు డిసిసి బ్యాంక్ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారని, బ్యాంక్ కు వచ్చిన ఖాతాదారుల పట్ల స్రవంతి సేవలను గుర్తించి నేడు ఘనంగా సన్మానించినట్లు వారు తెలిపారు. బదిలి పై వెళ్లిన వరంగల్ సెంట్రల్ బ్యాంక్ లో కూడా ఇక్కడి తరహలో భాగా పనిచేసి పేరు గడించాలని భ్యాంక్ సిబ్బంది, మణిదీష్ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమం లో బ్యాంకు మేనేజర్ తిరుపతి, సరిత బాలకృష్ణ, కార్తీక్, మణిదీప్ సొసైటీ సభ్యులు గాదం దేవేందర్, ఇమ్మడి ఓదెలు, చెలుమల్ల రాజేందర్, చుంచు శ్రీనివాస్, సిద్ధ గోపాల్, పిఏ సిఎస్ సభ్యులు యాసం శంకరయ్య, ఓదెలు, ప్రవీణ్ ,పాషా, హీరాలాల్ లు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now