ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
– ఊరూరా ఉట్లు కొట్టే సంబరాలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ములుగు జిల్లా నూగూరు వెంకటాపు రం మండలంలో ఊరూరా ఉట్లు కొట్టే సంబరాలు ఘనంగా నిర్వహించారు. సత్యభామ, గోపికల వేషధారణలో చిన్నా రులను తల్లిదండ్రులు అలంకరించి దైవభక్తిని చాటారు. శ్రీకృష్ణ అవతారాన్ని చిన్నారుల కు అలంకరించి శ్రీ కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. అనేక గ్రామాల్లో రాత్రి పొద్దు పోయిన తర్వాత ఉట్ల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనేక దేవాలయాల్లో ఉదయం నుండి భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, దేవాలయాల వద్ద భక్తులకు ప్ర సాదాలను పంపిణీ చేశారు.