ఆర్థిక ఇబ్బందుల్లో గ్రామ పంచాయతీలు..!

ఆర్థిక ఇబ్బందుల్లో గ్రామ పంచాయతీలు..!

ఆర్థిక ఇబ్బందుల్లో గ్రామ పంచాయతీలు..!

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం:నేడు గ్రామ పంచాయతీ ల్లో నిధులు లేక ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అభివృద్ధి పనులు చేసేందుకు చేతిలో చిల్లీ గవ్వ లేక కార్య దర్శులు నిత్యం పనులు చేపట్టలేక ఇబ్బందులు పడుతు న్నారు. ప్రత్యేకాధికారులకు కేవలం పేరుకే మాత్రమే ఎలాంటి ఉపయోగం లేదని, భారమంతా మాపైనే ఉందంటూ కార్య దర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండంలోని గ్రామానికి వెళ్లినా ఇలాంటి ఘటనలు కనిపిస్తాయని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా మండలంలో ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీ లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.

ఏడాది కాలంగా నిలిచిన నిధులు

జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు విడుదల చేస్తుంటారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి నిధులు మార్చి 2023తో ఆగిపోయాయి. ఇదిలా ఉండగా 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం గ్రామాలకు నిధులు కేటాయిస్తుంది. ఇటువంటి నిధులు మార్చి 2024చివరి సారిగా విడుదల చేస్తారు. ఇంటి పనుల నిర్మాణ అనుమతి పన్నులు సాధారణంగా కేటాయించబడతాయి. కేంద్ర  ప్రభు త్వాలు కేటాయించిన విధులను చేపట్టి సిబ్బంది జీతాల బిల్లులను చెల్లిస్తాయి. గ్రామాల్లో పారిశుధ్యం, మందు పిచి కారి, డంపింగ్ యార్డు.వీటితో పాటు శ్మశాన వాటికలు, పర్యా వరణ పరిరక్షణ మొక్కలు నాటడం, గ్రామ సభలు, వైద్యం, శివాలయాల నిర్వహణ, ఉత్సవాలు వంటి అనేక కార్యక్ర మాలు చేయాల్సి ఉంటుంది.

నెలల కొద్ది నిలిచిన జీతాల చెల్లింపు..!

కాగా ప్రతి నెల పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన వేతనా ల బిల్లులు నిలిచిపోయాయని పలువురి కార్మికులు అంటు న్నారు. ఒక్క మండలంలో కొంతమంది సిబ్బందికి 6నెలలు బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వేతనాలు రాక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు.

ప్రబలుతున్న వ్యాధులు..? 

గ్రామాల్లో పారిశుద్ధ్య పూర్తిస్థాయిలో చేయకపోవడం మూలం గానే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అందుకు నిధులు లేకపోవడమే కారణ మంటున్నారు. కార్యదర్ములే సొంత నిధులతో పారిశుధ్య ని ర్వహణ పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

పేరుకే ప్రత్యేకాధికారులు..భారమంతా కార్యదర్శిలపైనే…

మండలంలో గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పాలన ఫిబ్రవరి 1తేదీన 2024తో ముగిసింది. ఫిబ్రవరి 2 నుండి గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. వీరి ద్వారానే గ్రామాల్లో నిధుల ఖర్చు అభివృద్ధి పనులు చేస్తారు. నియమించబడిన ప్రత్యేకాధికారులు, అలా వచ్చి ఇలా వెళ్లారు తప్పా గ్రామా లకు వచ్చి సందర్శించిన సందర్భం లేదంటున్నారు. దీంతో పేరుకే ప్రత్యేకాధికారులు,భారమంతా కార్యదర్శులపైనే భారం పడుతుందంటున్నారు.

ఇబ్బందుల్లో పారిశుధ్య కార్మికులు..?

గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నుంచి ఏడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. కొంత మంది కార్మికులు ఒకరోజు జీపీ వర్క్‌కు వెళ్లి, మరుసటి రోజు కూలిపనులకు వెళ్లి కుటుం బాన్ని పోషించుకుంటున్నారు. రోజంతా కష్టపడినా మూడు పూటలా తినలేని దయనీయ స్థితిలో ఉన్నామని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

కొత్త పాలకవర్గం వస్తేనే భారం తగ్గుతోంది…

గ్రామ పంచాయతీలకు నూతను పాలకవర్గం లేకపోవడం పెద్ద సమస్యగా మారిపోయిందని పలువురు అంటున్నారు. సర్పం చ్ లు వస్తే పని భారం తగ్గుతుందని ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. సర్పంచ్ లు లేకపోవటంతో పనులను తాము పూర్తి స్థాయిలో నిర్వహించలేక పోతున్నామని పలు వురు కార్యదర్శులు వాపోతున్నారు.ఏదిఏమైనా స్థానిక ఎన్ని కల జరిగి కొత్త పాలక వర్గం ఏర్పడుతే ఆర్ధిక ఇబ్బందుల్లో నుంచి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పథకంలో కొనసా గుతాని చెప్పవచ్చు.