బాలల హక్కులను కాలరాయొద్దు

Written by telangana jyothi

Published on:

బాలల హక్కులను కాలరాయొద్దు

– ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరెడ్డి

ములుగు, తెలంగాణ జ్యోతి : బాలల బంగారు భవిష్యత్తుకై వారి హక్కులను అమలు చేయాలని, ఎవరూ కాలరాయొద్ద ని మల్లంపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు తిరుపతి రెడ్డి అన్నారు. సోమవారం ములుగు మండలం మల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా బాలల హక్కులపై అవగాహన సదస్సును నిర్వహించారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం తిరు పతిరెడ్డి మాట్లాడుతూ బాలలు విద్యార్థి దశలో మంచి అల వాట్లు, మంచి గుణాలు అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాల ను ఏర్పరచుకొని, వాటిని సాధించాలని తెలిపారు. అదేవి ధంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయగలరు అని వివరించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ జ్యోతి మాట్లాడుతూ పోక్సో చట్టం 2012, బాల్య వివాహాల నిరోధక చట్టం 2006పై అవగాహన కల్పించారు. అదేవిధంగా బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక వేధింపులు, నుండి గెలుపు చెందడానికి వారిలో మంచి అలవాట్లు నేర్చు కునే పద్ధతుల గురించి వివరించడం జరిగింది. చైల్డ్ హెల్ప్ లైన్ నాగమణి మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి కాల్ చేయగలరు అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారిత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ స్రవంతి, సఖి – కేసు  వర్కర్ మౌనిక, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now