ధర్మారం గ్రామంలో ఫ్రైడే, డ్రై డే, ఇంటింటా ఫీవర్ సర్వే
ధర్మారం గ్రామంలో ఫ్రైడే, డ్రై డే, ఇంటింటా ఫీవర్ సర్వే
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ధర్మారం గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్య క్రమం నిర్వహించారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాలలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని, దోమలు కుట్టకుండా, వృద్ధి చెందకుండా చూసుకోవాలని, దోమతెరలు వాడాలని, ఆరో గ్యం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు అవగా హన కల్పించారు. ఇంటింటి సందర్శన ద్వారా జ్వరం కేసు లను గుర్తించారు. వీధి కుక్కలు బెడద ఎక్కువగా ఉన్నందున, పిల్లల్ని బయటకు పంపకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ దారావత్ శ్రీను, ఎఎన్ఎం శారద ఆశా వర్కర్లు తదితరులు పాల్గోన్నారు.