అతివేగంతో ద్విచక్ర వాహనం నడిపిన యువకుడిపై కేసు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం 163 జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వాయువేగంతో దూసుకుపోతున్న ద్విచక్ర వాహ నాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాజేడు సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్ కదనం ప్రకారం… జగ న్నాధపురం పాయబాట్ల జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా మండలంలోని చెరుకూరు గ్రామానికి చెందిన మండప ప్రవీణ్ అనే యువకుడు తన పల్సర్ ద్విచక్ర వాహనంపై అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడుపు తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ద్విచక్ర వాహ నాన్ని స్వాధీనం చేసుకొని యువకుడు పై కేసు నమోదు చేసి నట్లు తెలిపారు. ఎవరైనా అతివేగంగా, అజాగ్రత్తగా వాహనా లు నడిపితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుం దని ఎస్సై రుద్ర హరీష్ తెలిపారు.