మహిళా సాధికారికత లక్ష్య సాధనలో ఎఫ్.పి.సి.ఎల్ భాగస్వామి

మహిళా సాధికారికత లక్ష్య సాధనలో ఎఫ్.పి.సి.ఎల్ భాగస్వామి

మహిళా సాధికారికత లక్ష్య సాధనలో ఎఫ్.పి.సి.ఎల్ భాగస్వామి

– శ్రీ శక్తి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం మొర్రవానిగూడెం లో బుధవారం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఎఫ్.పి. సి.ఎల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా అడిషనల్ డి.ఆర్డిఓ బాలస్వామి, సెర్ఫ్ డిపిఎం వేణుగోపాల్ రెడ్డి, ముఖ్య అతిథిలుగా హాజరై ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఆధ్వ ర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహించనున్నట్లు తెలి పారు. మహిళా సాధికారత లో ఎఫ్పీసీఎల్ భాగస్వామిగా, శ్రీ శక్తి నీ బలోపేతం చేసేందుకు ఎఫ్ పి.సి.ఎల్ కృషి చేస్తుందని ఆ సంస్థ వెంకటాపురం, వాజేడు మండలాల ముఖ్య కార్య నిర్వహణ అధికారి రాయపాటి సత్యేంద్ర కుమార్ తెలిపారు. వెంకటాపురం మండలంలో ఎఫ్పీసీఎల్ ఆధ్వర్యంలో 35 స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేశారు. అలాగే వాజేడు మండలంలో 26 స్వయం సహాయక సంఘాలను కూడా ఎఫ్పీసీఎల్ లో భాగస్వాములు చేస్తూ, రెండు మండ లాలకు వెంకటాపురం లోని సెర్ఫు కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు సిఇఓ తెలిపారు. శ్రీ శక్తిని వ్యవసాయ పంటల ఉత్పత్తి రంగాల్లో కొనుగోళ్ళలో కూడా భాగ స్వాము లు చేసి తద్వారా మహిళా సాధికారి క ఉమెన్ ఎమ్ పవర్ మెంటు తో ఆర్థిక అభ్యున్నతిని సాధించే లక్ష్యంతో, ప్రభుత్వం కృషి చేస్తుందని అదికారులు తెలిపారు. ఈ సందర్భంగా మొర్ర వానిగూడెం లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రం ను ఎఫ్ఈసీఎల్ భాగస్వామ్యంతో సెర్ఫ్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహి స్తారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రారం భోత్సవంలో ఆలుబాక వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ కన్య మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని తక్కువ ధరలకు దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రంలో విక్రయించుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ బాలస్వామి, సెర్ఫ్ డిపిఎం వేణుగోపాల్ రెడ్డి, వెంకటాపురం సెర్ఫ్ ఏపిఎం కరుణాకర్, సి.సి. వెంకటలక్ష్మి, కంపెనీ చైర్మన్ కోడి పై నయో మి, ఎఫ్.పి.సిఎల్ సీఈవో రాయపాటి సత్యేంద్ర కుమార్, మొరవానిగూడెం స్వయం సహాయక సంఘాల మహిళా సోద రీమణులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధాన్యం కొనుగో లు కేంద్రం లో విక్రయించి ప్రభుత్వ మద్దతు పొందుతామని ఈ సందర్భంగా రైతులు అధికారులకు హర్షద్వానాల మధ్య ప్రకటించారు.