జోనల్ క్రీడలలో జాకారం విద్యార్థుల ప్రతిభ

Written by telangana jyothi

Published on:

జోనల్ క్రీడలలో జాకారం విద్యార్థుల ప్రతిభ

– కబడ్డీ అండర్ 19 లో విజేత

– డాక్టర్ రాములు ఆధ్వర్యంలో వైద్య సేవలు

ములుగు ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాల కళాశాల క్రీడల కాళేశ్వరం జోన్ పోటీలు జాకా రం గురుకులంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జాకారం గురుకులం ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ వెంకటే శ్వర్లు ఆధ్వర్యంలో కొనసాగుతుండగా, వివిధ గురుకులకు చెందిన క్రీడాకారులు వివిధ రంగాల పోటీల్లో పాల్గొనగా, గెలు పు కోసం పి ఈ డి పీఈటీలు శిక్షణ మెలుకువలు అందించి గెలుపు కోసం కృషి చేశారు. ఈ పోటీల్లో జాకారం విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కబడ్డి అండర్ 19 లో జాకారం విద్యా ర్థులు విజేతగా నిలువగా, అండర్ 14 లో ఏటూరు నాగారం విద్యార్థులు విజేతలుగా నిలిచారు. అందరి అభినందనలు పొందారు. ఈ సందర్భంగా డిసీఓ డాక్టర్ ఏ వెంకటేశ్వర్లు ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల డిసీఓలు బిక్షపతి, శ్రీనివాస్, యాదగిరి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. క్రీడాకారులకు డాక్టర్ సిహెచ్ రాములు ఆధ్వ ర్యంలో వైద్య సేవ అందించి మందులు పంపిణీ చేశారు. వైద్య బృందం జాయిసీ రాచెల్, వెంకన్న, తిరుమల, నసీమ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్రీడాకారులకు నాణ్యమైన భోజనం తో పాటు వసతులు ఏర్పాటు చేయడం పట్ల పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ నల్లబెల్లి సాంబయ్య పటేల్ జాకారం పాఠశాల ఉపాధ్యాయు ల బృందం సురేష్ బాబు, రామ్ రెడ్డి, పిచ్చిరెడ్డి, మమత,  వ్యాయామ ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి, భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now