మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని శివా పురం గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ యాలం రాంబాబు కుటుంబ సభ్యులనుబి ఆర్ ఎస్ శ్రేణులు పరామర్శించారు. ములుగు జిల్లా అధ్యక్షు లు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ప్రదీప్ ల పిలుపుమేరకు ఏటూరునాగారం మండల కమిటీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తక్షణ సహాయం కింద 21 వేల నగదు, ఒక కింట బియ్యాన్ని యాలం రాంబాబు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం బి ఆర్ ఎస్ శ్రేణులు తాండూరి రఘు, కిరణ్, బోజారావు, ఖలీ ల్, కాకులమర్రి భాస్కర్, శివాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేష్, బి ఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.