ములుగులో దొంగ నోటు కలకలం..!
ములుగులో దొంగ నోటు కలకలం..!
– గుర్తించిన బ్యాంకు అధికారులు
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలో దొంగ నోటు కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం ఎస్బిఐ బ్యాంకు లో డిపాజిట్ చేయడానికి జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ షాపు గుమాస్తా రూ.3 లక్షల 50 వేలు తీసుకు వచ్చాడు. వాటిలో ఒకటీ దొంగ నోటుగా బ్యాంకు అధికారులు గుర్తించారు. అధికారులు ఈ విషయన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గుమస్తాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అవి షాపులో విత్తనాలు, ఎరువులు అమ్మగా వచ్చిన డబ్బులే అని తేలడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. కాగా, జిల్లా కేంద్రంలో నకిలీ కరెన్సీ వెలుగులోకి రావడంతో వ్యాపారులు, స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.