అయ్యప్ప మహాపడిపూజ నిర్వహణ కమిటీ ఎన్నిక

అయ్యప్ప మహాపడిపూజ నిర్వహణ కమిటీ ఎన్నిక

అయ్యప్ప మహాపడిపూజ నిర్వహణ కమిటీ ఎన్నిక

– ఈనెల 16న జిల్లా కేంద్రంలో అయ్యప్ప మహాపడిపూజ

       ములుగు ప్రతినిధి :  జిల్లా కేంద్రంలో ప్రతీ సంవత్సరం వైభవంగా నిర్వహించే అయ్యప్ప మహా పడిపూజ ఉత్సవ కమిటీని బుధవారం అయ్యప్ప భక్తమండలి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా గురుస్వాములు భుక్య రమేష్, పౌడాల ఓంప్రకాష్, కోయిల కవిరాజ్, వంగర పాపా రావు, ప్రదాన కార్యదర్శులుగా శీలమంతుల విగ్నేశ్వర చారి, దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి, కోశాధికారులుగా సాని కొమ్ము శ్రీనాథ్ రెడ్డి, సదానందం, కార్యదర్శులుగా కొత్త సురేందర్, బాణాల రాజ్ కుమార్, ఆడెపు రాజు, ఒజ్జల కుమార్, మాదరి వంశీ, గొట్టే ముక్కల తిరుపతి, ప్రచార కార్యదర్శులుగా సంఘ రంజిత్, కొండి రవీందర్, కంచర్ల రాజు, పేరబోయిన విజయ్, అన్నదాన ఇన్చార్జిలుగా బత్తుల సురేందర్, రుద్రారపు నరేష్, చిట్యాల మహేష్ స్వామి, పరికిరాల రాజేష్, వైనాల ప్రణయ్, వైనాల క్రాంతి,  అనిశెట్టి పవన్, అదేవిధంగా నగర సంకీర్తన కలశముల ఇన్చార్జిలుగా గోరంట్ల శ్రీనివాస్, లింగాల శ్రీను, పిట్ట ల భద్రయ్య, కాసర్ల సంతోష్, లతో పాటు మండపాల ఇన్చార్జి లను, టెంట్ ఇంచార్జ్ లను ఎన్నుకున్నారు. అనంతరం ఈ నెల 16న నిర్వహించే మహాపడి పూజోత్సవ కార్యక్రమ కర్తగా వ్యవహరించడానికి జరిగిన వేలంని స్థానిక వ్యాపారస్తులు పైడిమల్ల గోపికృష్ణ గౌడ్ స్వామి కైవసం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని రామాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మహా పడిపూజ మహోత్సవాన్ని ఈ నెల 16 నిర్వహించనున్నట్లు మహా పడిపూజ ఉత్సవ నిర్వహణ కమిటీ తెలియజేసింది. అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ మహా పడి పూజోత్సవానికి అయ్యప్పలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కమిటీ కోరింది.