Eetala : ములుగు జిల్లాకు ఈటెల రాజేందర్
తెలంగాణ జ్యోతి, నవంబర్ 21, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో బుధవారం బిజెపి నాయకులకు కార్యకర్తలకు,ప్రజలకు మరింత ఉత్సాహన్ని నింపేందుకు ఎన్నికల కమిటీ నిర్వహణ చైర్మన్ ఈటెల రాజేందర్ ములుగు జిల్లాలో పర్యటించనున్నారనీ బిజెపి జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన గల సాధన స్కూల్ దగ్గర నిర్వహించే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఈటెల హాజరుకానున్నారనీ అన్నారు.ములుగు బిజెపి అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ గెలుపు కోరుతూ బిజెపి మేనిఫెస్టో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, ఆయన ప్రజలకు వివరించను న్నారని అన్నారు. నియోజక వర్గంలోని బిజెపి కార్యకర్తలు పార్టీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 24 తేదీన బీ ఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించే క్రమంలో ముందస్తుగానే బిజెపి బహిరంగ సభను నిర్వహిస్తుండడం జిల్లా ప్రజలలో బిజెపి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులలో నూతన ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.