విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి 

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి 

– ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరన్ డిమాండ్ 

కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: విద్యారంగ సమస్య లను పరిష్కరించేంతవరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరన్ అన్నారు. ఆయన బుధవారం కాటారం మండల కేంద్రంలో గల పాఠశాలలు, జూనియర్ కళాశాలలను సంద ర్శించారు. పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారా యని, అలాగే జూనియర్ కళాశాలలో పేరుకుపోయిన సమ స్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్కాలర్ షిప్ లను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని అన్నారు. కాటారం మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్, జూనియర్ కాలేజ్ ముందు వర్షం నీరు చెరువును తలపిస్తోందని, దాంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు పడుతున్నారని అన్నారు. వెంటనే అధికారులు మట్టి పోయించాలని, గడ్డిని తీసేయాలని కోరారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విద్యకు ఈసారి బడ్జెట్ తగ్గించడం సరికాదని అన్నారు. విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేకుండా, సరిపోయేంత ఫ్యాకల్టీ లేకుండా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కనీసం లైట్లు, ఫ్యాన్లు లేని పాఠశాలలు అనేకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు . విద్యారంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు ఈశ్వర్, అఖిల్, జూనియర్ కాలేజ్ కమిటీ సభ్యులు అర్జున్, శివ తదితరులు పాల్గొన్నారు.