వీధి కుక్కల దాడి నుండి ప్రజలను కాపాడాలి

Written by telangana jyothi

Published on:

వీధి కుక్కల దాడి నుండి ప్రజలను కాపాడాలి

– సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్

భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: చిన్న పిల్లల నుండి మొదలుకొని వృద్ధుల వరకు రోజురోజుకు ఏదో ఒకచోట వీధి కుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఆందోళన వ్యక్తం చేశారు. రామకృష్ణాపూర్ వి గ్రామంలో దళిత కాలనీలో బుధవారం ఇంట్లో నిద్రపోతున్న వృద్ధాప్యం లో ఉన్న ఆకునూరి చంద్రమ్మ పై వీధి కుక్కలు దాడి చేయగా ఆమె తీవ్ర గాయాలతో ఎంజీఎం లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టా డుతుందని పేర్కొన్నారు. గత పది రోజుల క్రితం మండల కేంద్రంలో ఎర్రవెల్లి నరేష్ ఇంట్లో నిద్రిస్తుండగా వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయని అన్నారు. ఇలా రోజురోజుకు ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక కాలనీలో వీధి కుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయనీ, వాటి నివారణకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా జిల్లా ఉన్నత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామాలలో వీధి కుక్కల నివారణకు తక్షణమే చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, దాడిలో గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి తక్షణమే స్పందించి, గ్రామాలలో వీధి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Leave a comment