శ్రీ షిరిడీ సాయిబాబా మందిరానికి వెండి పంచపాత్ర ఉధ్ధరిణి విరాళం
శ్రీ షిరిడీ సాయిబాబా మందిరానికి వెండి పంచపాత్ర ఉధ్ధరిణి విరాళం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్ర పురం గ్రామంలో వేంచేసి వున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి పురోహితులు కొండూరి శ్రీనివాస శర్మ దంపతులు నిత్య పూజల నిమిత్తం వెండి పంచపాత్ర ఉధ్ధరిణిని భక్తుల సమక్షంలో అందజేశారు. గ్రామ భక్తమండలి, శ్రీ అంజన్న స్వామి మాల ధారణ భక్తులు, భవాని స్వాములు సౌకర్యార్థం అందజేసినట్లు పురోహితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల ధారణ భక్తులు గ్రామ భక్తబండలి పాల్గొన్నారు.