జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వనరుల అభివృద్ధికి విరాళం 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వనరుల అభివృద్ధికి విరాళం 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వనరుల అభివృద్ధి కొరకు, పదివేల116 రూ. విరాళం అందజేశారు. వెంకటాపురం పట్టణ వాస్తవ్యు లు స్వర్గీయ ఆత్మకూరి సూర్యప్రకాశరావు (సూరిబాబు) 21వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబీకులు ఆత్మకూరి పట్టాభి , గుడవర్తి నరసింహమూర్తి, తదితరులు, స్వర్గీయ సూరిబాబు కుటుంభీకులు పాఠశాల వనరులు, అవసరాలకు సహాయా ర్థంగా 10వేల116 రూ. హెచ్.ఎం సత్యనారాయణ కు నగదు అందజేశారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన వనరుల ను సమకూర్చగలమని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు  జి.వి.వి. సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ , చలమయ్య, శ్రీనివాసరావు, రామకృష్ణ, వివేక్, గణేష్ వెంకటేశ్వర్లు, రవి , పాఠ శాల ఉపాధ్యాయులు  బోల్లే శ్రీనివాస్ , శేష నరసింహారావు, శ్రీరామమూర్తి,వెంకటేశు, రామ్ కోటి,తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.