అశ్వారావుపేట ఎస్సై అదృశ్యం..! 

Written by telangana jyothi

Published on:

అశ్వారావుపేట ఎస్సై అదృశ్యం..! 

• అపస్మారక స్థితిలో మహబూబాబాద్ లో గుర్తింపు

• పురుగుల మందు తాగి.. 108కు ఫోన్ చేసిన ఎస్సై

• పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ తరలింపు

తెలంగాణ జ్యోతి, వరంగల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను అదృశ్యమైన ఘటన ఆదివారం కలకలం రేపింది. ఉదయం నుంచి ఆయన రాకుండా పోగా.. రాత్రి 11గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుతున్న సమ యాన స్వయంగా ఆయనే 108కు ఫోన్ చేశాడు.రాత్రి 11గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుతున్న సమ యాన స్వయంగా ఆయనే 108కు ఫోన్ చేశాడు. దీంతో సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో ఐదు నెలలుగా ఎస్సైగా విధులు నిర్వర్తిస్తుండ గా, ఆదివారం ఉదయం 8గంటలకు స్టేషన్కు వచ్చి సిబ్బందితో మాట్లాడారు. ఆ తర్వాత కారు నడుపుకుంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన వద్ద రెండు సెల్ నంబర్లు స్విచ్చాఫ్ రావడంతో సిబ్బంది సీఐ జితేందర్ రెడ్డికి సమా చారం ఇచ్చారు. ఆయన విచారణ చేపట్టగా అశ్వారావుపేట మండలం తిరు మలకుంట ఆటవీ ప్రాంతంలో స్విచ్చాఫ్ అయ్యాయని గుర్తించినట్లు తెలిసిం ది. రాత్రి 10.30 గంటల వరకు కూడా ఎస్సై ఆచూకీ లభించక సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజులుగా ఎస్సైపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుండగా.. స్టేషన్లోని సిబ్బందికి, ఎస్సై మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే సిబ్బంది సైతం జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయగా ఎస్సై నాలుగు రోజులు సెలవులో వెళ్లి బుధవారమే విధుల్లో చేరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులతోనే ఆవేదన చెందినట్టు ప్రచారం జరుగుతోంది.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now