పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జిల్లా అధికారులు.
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జిల్లా అధికారులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో శనివారం ములుగు జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి కె. సత్యపాల్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మండలంలో ఎలక్షన్ సంబంధిత పోలింగ్ స్టేషన్లో మినిమం వసతులు నీళ్లు, కరెంటు, బాత్రూమ్స్ ఉన్నాయా అని పరిశీలించారు. పోలింగ్ రోజు ఓటర్లకు ఎటువంటి అసౌకర్యంం కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించినట్లు మండల తాసిల్దార్ ఎస్ సమ్మయ్య తెలిపారు. జిల్లా అదికారుల వెంట తహసీల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో అడ్డూరి బాబు, డిప్యూటీ తహశీల్దార్ మహేందర్, ఎంపీఓ హనుమంతరావు, రికార్డ్ అసిస్టెంట్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.