క్రీడాకారులకు కిట్స్ పంపిణీ.
క్రీడాకారులకు కిట్స్ పంపిణీ.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం మరికాల పంచాయతీ లో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే దశలో ప్రభు త్వ పరంగా మంజూరైన క్రీడా సామాగ్రిని సర్పంచ్ సత్యవతి పంపిణీ చేశారు. గ్రామీణ యువత తమలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకొని, మండల, డివిజన్, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలలో రాణించాలని మరికాల పంచాయతీ సర్పంచ్ సత్యవతి కోరారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రికెట్, వాలీబాల్ ఇతర క్రీడా సామాగ్రిలను పంపిణీ చేశారు. క్రీడలు దేహదారుడ్యాన్ని, స్నేహ సంబంధా లను పెంపొంది స్తాయని, గ్రామీణ యువత అన్ని రంగాలతో పాటు క్రీడలలో రాణించాలని, గ్రామ పెద్ద ,ప్రముఖ రైతు బాలసాని శ్రీనివాస రావు, పంచాయతీ కార్యదర్శి నగేష్ తదితరులు యువతను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ క్రీడాకారులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.