ఎస్.కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ
ఎస్.కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూ రునాగారం మండలం, కన్నాయిగూడెం మండలం లోని 214 వరద బాధితులకు ఎస్కే ఫౌండేషన్ అధ్యక్షుడు నోబెల్ రాజు ఎంపీడీవో రాజ్యలక్ష్మి నిత్యవసర సరుకులను అందజే శారు.శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో నిత్యవసరలు, దుప్పట్లతో పాటు సుమారు 25 రకాల వస్తువులను బాధితులకు అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడం ఎంతో గొప్ప విషయమని ఎంపీడీవో రాజ్యలక్ష్మి అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎస్కే ఫౌండేషన్ వా రు నిర్వహించాలని కోరారు.ఈకార్యక్రమంలో ఎస్.కె ఫౌండే షన్ ప్రతినిధి రాజశేఖర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.