ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు
– అమరావతి విద్యాలయం హెచ్ ఎమ్ వీరగాని రాజయ్య
– డీఎస్సీలో ఎంపికైన 11 మందికి సన్మానం
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని అమరావతి విద్యాలయం ప్రధానోపాధ్యాయుడు వీరగాని రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మీ దేవిపేట గ్రామంలో ఉన్న అమరావతి విద్యాలయంలో ఇటీవ ల జరిగిన డీఎస్సీ ఫలితాలలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అమరావతి విద్యాలయం విద్యార్థులు 11 మందిని శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా వీరగాని రాజయ్య మాట్లా డారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని, మిమ్మల్ని మార్గదర్శకులుగా తీసుకొని మీ అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. ఇప్పుడు మీ వద్ద చదివేవాళ్ళు 10, 20 సంవత్సరాల్లో ఉన్నత స్థానంలో ఉంటారని, ఉపాధ్యాయుల సహకారం వల్లనే మనమందరం ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు కష్టపడి పనిచేసి విద్యార్థు ల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని కోరారు. సమావేశం లో ఉపాధ్యాయులుగా ఎంపికైన అమరావతి విద్యాలయం విద్యార్థులు దొడ్ల సృజన, పెంట సృజన, బస్వోజు మమత, కొండ శ్రీకాంత్, పబ్బరాజు గౌడ్ ,పబ్బ రమేష్ గౌడ్ ,బీరెల్లి అశోక్, పోలోజు ప్రశాంత్ ,పిఈటిగా నక్కరాజు ఇటీవల గురు కులంలో జూనియర్ లెక్చరర్ లుగా గోగు రాజస్వామి, బీరెల్లి సమ్మయ్యలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో అమరావతి విద్యాలయం డైరెక్టర్లు మూల రాజయ్య, వీరగాని ఆనందం, అంతటి సుమలత, ఉపాధ్యాయులు జేరిపోతుల కిరణ్, గతంలో విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు గంధం లక్ష్మణ్, రంగిశెట్టి రాజేందర్, అంతటి వెంకటేశ్వర్లు, బస్వోజు రమణా చారి, పాఠశాల సలహాదారులు కొండ తిరుపతి, బైరి సంతోష్ తదితరులున్నారు.