జర్నలిస్టుల గుడిసెలు తొలగించడం సరైంది కాదు 

జర్నలిస్టుల గుడిసెలు తొలగించడం సరైంది కాదు 

జర్నలిస్టుల గుడిసెలు తొలగించడం సరైంది కాదు 

– గుడిసెలు వేసుకున్న జర్నలిస్టులకు వెంటనే పట్టాలివ్వాలి 

– రామప్ప జర్నలిస్టు సొసైటీ అధ్యక్షులు బేతి సతీష్ 

– పాలంపేటలో రహదారి పై జర్నలిస్టుల ధర్నా 

– సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని ఏం ఆర్ ఓ, ఎస్ ఐ హమీ 

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి గా ఉండే జర్నలిస్టుల గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగించడం సరైంది కాదని రామప్ప జర్నలిస్టు సొసైటీ అధ్యక్షులు బేతి సతీష్ అన్నారు. వెంకటాపూర్ మండ ల జర్నలిస్టులు మండలం పాలంపేట గ్రామంలోని ప్రభుత్వ భూమిలో గత పది నెలల క్రితం గుడిసెలు వేసుకున్నారు. ఇదే అంశం పై పలుమార్లు మంత్రి సీతక్క తో సహా కలెక్టర్, ఏం ఆర్ ఓ కి వినతి పత్రం అందించడం జరిగింది. జర్నలిస్టుల వినతకి స్పందించిన మంత్రి సీతక్క పలుమార్లు జిల్లా కలెక్టర్ కి దృష్టికి తీసుకెళ్ళింది. కాగా, మంగళవారం వెంకటాపూర్ రెవెన్యూ అధికారులు పాలంపేట కు చేరుకొని జర్నలిస్టులు వేసుకున్న గుడిసెలను తొలగించడం ప్రారంభించారు. ఈ విష యం తెలుసుకున్న వెంకటాపూర్ జర్నలిస్టులు వెంటనే పాలం పేట కు చేరుకొని గుడిసెల తొలగింపు కార్యక్రమంను అడ్డు కోవడం జరిగింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు గుడి సెలను తొలగించడం ఆపలేదు. దీంతో జర్నలిస్టులు పాలం పేట రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా కి దిగారు. ఈ క్రమంలో రహదారి పై పెద్ద సంఖ్య లో రాకపోకలు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న వెంకటాపూర్ ఏం ఆర్ ఓ సదానందం, ఎస్ ఐ జక్కుల సతీష్ పాలంపేట చేరుకొని ఉన్నత అధికారు లతో మాట్లాడాలి జర్నలిస్టుల సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తామని హమీ ఇచ్చారు. దీంతో జర్నలిస్టులు ధర్నా కార్యక్రమంను విరమించారు. ఈ సందర్బంగా రామప్ప జర్న లిస్టు సొసైటీ అధ్యక్షులు బేతి సతీష్ మాట్లాడారు. జర్నలి స్టుల సమస్య పరిష్కారం కొరకు అధికారులు కృషి చేయాలని కోరారు. పాలంపేట లో జర్నలిస్టులు గుడిసెలు వేసుకున్న స్థలాలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమం లో జర్నలిస్ట్ లు దేశిని మహేందర్, గొరంటాల విజయ్, తీగల యుగంధర్, రంగిశెట్టి రాజేందర్, కేతిరి బిక్షప తి, అలుగొండ రమేష్,మునిగాల రాజు, బానోత్ యోగి, దేశిని వినీల్, ఆకుల రామకృష్ణ, ఎలగందుల శంకర్, దండపేల్లి సారంగం, గట్టు ప్రశాంత్, బిరేల్లి రమేష్, పిల్లలమర్రి శివ, రామ్, తదితరులు పాల్గొన్నారు.