ఎల్ టి ఆర్ కేసు పై జాప్యమేల

ఎల్ టి ఆర్ కేసు పై జాప్యమేల

– ఆదివాసి కుటుంబం నిరసన. 

వెంకటాపురంనూగూరు,తెలంగాణాజ్యోతి:ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రలో తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఆదివాసి మహిళ సంఘాల నాయకుల మద్దతు తో నిరసన వ్యక్తం చేశారు. గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందిన ఆదివాసిలు ఇర్ప వెంకట నర్సమ్మ అనే మహిళకు అరుణాచలపురం గ్రామ శివారులో సర్వే నెంబర్ 69/1 లో 3ఎకరాల భూమి వుంది. 1999 సం నుండి ప్రభుత్వ పట్టా కలిగి ఉన్నారు. ఆ భూమిని పాయబాటల గ్రామానికి చెందిన కొప్పుల చొక్కారావు అనే గిరిజనేతరుడు కౌలు పేరుతో అక్రమంగా భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తన భర్త 2022 లో మరణించిన అనంతరం తమ భూమిని అతను ఆక్రమించు కున్నారని, న్యాయం చేయమని కోరుతూ 2022 సం.లో ఏటూరునాగారం ఐటిడిఏలో ఫిర్యాదు చేయ గా భూ బదలాయింపు చట్టం కేసు నమోదు అయిందనీ వెల్ల డించారు. మూడు వాయిదాలకు పూర్తి ఆధారాలతో హాజరు అయినప్పటికి తుది తీర్పు ఇవ్వటంలో అధికారులు నిర్లక్ష్యం వహించటంపై ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయంపై ఆదివాసి మహిళకు న్యాయం చేయాలని డిమాం డ్ చేస్తూ, జాప్యంపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం వాజేడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ చట్టాలు, ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతం అయినా వాజేడు మండలంలో గిరిజనులకే న్యాయం జరగ టం లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ సంఘం నేతలు టింగా బుచ్చయ్య, బోడెబోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసి మహిళకు న్యాయం జరిగే వరకు దశల వారి పోరాటాలు నిర్వహించనున్నట్లు ఏ ఎస్పి నాయకులు విలేక రులకు తెలిపారు.