కాళేశ్వరం దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

Written by telangana jyothi

Published on:

కాళేశ్వరం దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. మంగళవారం కాళేశ్వరం కార్య నిర్వహణాధి కార్యాలయంలో దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయుట, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చే యుట,సరస్వతి పుష్కరాలు నిర్వహణకు ఏర్పాట్లు తదితర  అంశాలపై దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమవేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ కాళేశ్వరం దేవాలయం తెలంగాణలోని ప్రము ఖ శైవ క్షేత్రమని, ఈ దేవాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించన్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికలో దేవాలయం అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను పొందుపరిచాలని అంమరు. ప్రధానంగా దేవాల య విస్తరణ, ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడం, పునర్నిర్మా ణం, ఆధునీకరణ చేయడం, యాత్రికుకు సదుపాయాలు కల్పన, యాత్రికుల కోసం ఆవాస సదుపాయాలు, భోజన శాలలు, పార్కింగ్ స్థలాలు మరియు సురక్షితమైన నీటి సదు పాయాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆల య పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడం, ప్రత్యేక ప్యాకే జీలు అందుబాటులో ఉంచడం, పరిసరాల అభివృద్ధి, ఆల య పరిసరాల్లో పచ్చదనం పెంపొందించడం, పారిశుద్ధ్య మరి యు ప్రకృతి సంరక్షణ చర్యలను చేపట్టాలని తెలిపారు. అభివృద్ధి చర్యలు ప్రవేశ ద్వారం, దేవాలయ ప్రధాన ద్వారా న్ని శిల్ప కళతో అందంగా నిర్మించడం, యాత్రికుల సౌకర్యార్థం విస్తారమైన మండపాల నిర్మాణం, గోదావరి ఘాట్ అభివృద్ధి, గోదావరి నది తీరాన్ని శుభ్రతతో, అందంగా అభివృద్ధి చేయ డం, స్నాన ఘాట్లను ఏర్పాటు చేయడం వంటివి చేపట్ట నున్న ట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆవాసాల ఏర్పా టు, స్నాన సదుపాయాలు, దేవాలయానికి సులభంగా చేరు కునే రహదారులను అభివృద్ధి చేయడం, వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. దేవాలయం చుట్టూ పర్యాటక మార్గాలను అభివృద్ధి చేయడం, స్థానిక సాంస్కృతిక ప్రదర్శ నలు, మ్యూజియంలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. భద్రతను పెంచేందుకు ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతో రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, దేవాదాయ, పర్యాటక శాఖల అధికారులతో టాస్క్ ఫోర్స్ టీము ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవాలయ అభివృద్ధికి ప్రత్యేకంగా మంజూరైన నిధులతో చేపట్టిన పనులు పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. కాళేశ్వరం దేవాలయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తద్వారా ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం ఎంతో అభివృద్ధి చెంది భక్తులతో విరాజిల్లుతుందని అన్నారు. భక్తులకు ఉత్తమ సేవలను అందించడం, పర్యాటకుల సంఖ్యను పెంచడం ఈ మాస్టర్ ప్లాన్ యొక్క ప్రధాన లక్ష్యమ ని పేర్కొన్నారు. గోదావరి వద్ద నిర్మించిన సులబ్ కాంప్లెక్స్ నుండి వ్యర్దాలు గోదావరిలో కలుపుతున్నారని ప్రజలు తెలు పగా తక్షణం ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాలని అధికారు లను ఆదేశించారు. అస్థికలు. గోదావరిలో కలిపేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు దేవాలయ అధీనంలో ఉన్న రూములు ఇవ్వాలని, ఎందుకు ఇవ్వడం లేదని దేవస్థానం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ ఇలాంటి ఫిర్యా దులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తుల ఆలోచన మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని భక్తులు మన అతిధులని స్పష్టం చేశారు. భక్తులు పరిశుభ్రతకు సహకరించాలని సూచించారు. స్నానాలు ఘాట్ వద్ద సురక్షిత మంచినీరు ఏర్పాట్లు చేయాలన్నారు. సమాచార పౌర సంబంధాలు, దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్ హను మంతరావు మాట్లాడుతూ భక్తులకు సౌకర్యాలు కల్పనలో రాజీ పడొద్దని తెలిపారు. కాలేశ్వరం వచ్చే భక్తులు మహిళలు పురుషులు బట్టలు మార్చుకునేందుకు స్నానాలు గదులు ఏర్పాటు చేయాలని తెలిపారు ఎంతో ప్రాసిస్తే ఉన్నటువంటి ప్రాసిస్త్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులపైన ఇటు అధికారులు పైన ఉందని తెలిపారు నిర్మాణంలో ఉన్న 100 గదుల నిర్మాణ లను ప్రతిఘటన పూర్తి చేయాలని ఆయన తెలిపారు ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు మోడల్ గా ఉండే విధంగా మరుగుదొడ్ల నిర్మా ణాలు చేపట్టాలని పేర్కొన్నారు దేవాలయాలకు ఒకే విధమైన రంగులు వేసేందుకు చెల్లెలు చేపట్టాలని రాష్ట్రవ్యాప్తంగా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు కాలేశ్వరం త్రివేంగ దేవాలయాలు ఒకటని ఎంతో ప్రాసిస్సిత ప్రసిద్ధి చెందిన దేవాలయం అని ఆయన పేర్కొన్నారు. 2025లో జరుగనున్న సరస్వతి పుష్కరాలు నిర్వహణకు ఘాట్ సిద్ధం చేయాలని అన్నారు. గోదావరి హారతి కార్యక్రమాలను చేపట్టాలని అన్నా రు. భక్తులు శని పూజలు చేసిన తదపరి బట్టలు గోదావరిలో వేస్తున్నారని, గోదావరి అపవిత్ర కాకుండా బట్టలు వేసేందుకు ప్రత్యేకంగా డ్రమ్ములు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికా రులను ఆదేశించారు. అస్థికలు భద్రప్రచేందుకు ప్రత్యేకంగా లాకర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ 19.39 కోట్ల ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టిన పనుల్లో 12.07 కోట్ల విలువ గల పనులు పూర్తి అయ్యాయని మిగిలిన పనుల్లో భూ సమస్య వల్ల 4 పనులు ఆగిపోయా యని,ఒక పని రద్దు జరిగిందని, 3 పనులు ప్రగతిలో ఉన్నా యని పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మ యాంక్ సింగ్,పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ శ్రీనాధ రావు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now