మారుమూల అటవీ గ్రామాల్లో కార్డన్ సెర్చ్

మారుమూల అటవీ గ్రామాల్లో కార్డన్ సెర్చ్

– అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించవద్దు.

వెంకటాపురం నూగూరు,  తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని ఆలుబాక పంచాయితీ మారుమూల గ్రామాలలో మావోయిస్టుల వారో త్సవాల సందర్భంగా వెంకటాపురం పోలీసులు శుక్రవారం కార్డన్ సెర్చ్  కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని సీతారాంపురం, ముత్తారం, బోధాపురం తోపాటు పలు గ్రామాల్లో ఎస్.ఐ. కే తిరుపతిరావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక భద్రతాపరమైన అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లోకి వచ్చే అపరిచిత వ్యక్తు లకు ఆశ్రయం కల్పించవద్దని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే భారీ వర్షాలు, గోదావరి వరదలు కారణంగా వాగులు వరదలు ఉప్పొంగిపోతున్నాయని, చేపల వేటకు వెళ్లరాదని, వరద ప్రమాదాలు పొంచి ఉన్నాయని, జాగ్రత్తలు వహించాలని కోరారు. అలాగే గ్రామీణ యువత విద్య, ఉద్యోగ ఉపాధి అవ కాశాలపై రాణించాలని, బడి వయసు పిల్లలను పాఠశాలలకు పంపించాలని, ప్రభుత్వ గిరిజన సంక్షేమ పథకాలను సద్విని చేసుకోవాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపతి రావు తో పాటు సివిల్ మరియు సిఆర్పిఎఫ్, ఆలుబాక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.