ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి.

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి.

–  జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి జిల్లా అధికారులు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావే శపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కా రానికి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రజావాణి నుండి కూడా జిల్లాకు సంబంధించినటువంటి దరఖాస్తులు రావడం జరుగుతుందని , అట్టి దరఖాస్తులు వారం రోజుల్లో పరిష్కరించి ప్రజావాణి వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులు సత్వర పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు వారి వారి కార్యాలయ పరిధిలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించుకోవాలని ఆదేశించారు. సమస్య పరిష్కారానికి అందచేసిన దరఖాస్తు దారునికి సమస్య పరిష్కార స్వభావంపై లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం చాలా ముఖ్యమైనదని దరఖాస్తుల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన తెలిపారు. నేడు జిల్లా నలుమూలల నుండి 72 మంది ప్రజా వాణిలో తమ సమస్యలను పరిష్కరించాలని దరఖాస్తులు చేసుకు న్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.