అయ్యవారిపేటలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. 

అయ్యవారిపేటలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి :  ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం అయ్యవారిపేట గ్రామములో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ను పేరూరు‌ ఎస్.ఐ. జి. రమేష్ నిర్వహించారు. గ్రామీణ యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటై బంగారు భవిష్యత్ నాశనం చేసుకోకూడదని, అట్టి పిల్లలని ఎప్పుడు కనిపెడు తూ తగిన జాగర్తలు తీసుకోవాలని , తల్లిదండ్రుల గ్రామ స్థులకు అవగాహన కల్ఫించారు. అలాగే మైనార్టీ తీరని పిల్లలను ఎవరు కూడా పనులలో పెట్టుకోవద్దని, ముఖ్యంగా రైతులు, చత్తీస్ఘడ్ నుండి తీసుకొచ్చిన వ్యక్తులలో, చిన్న పిల్లలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతులదే అన్నారు. ఒకవేళ అలా బాలకార్మికులు ఏవైనా కనిపిస్తే పనిలో పెట్టుకున్న యజమాని పైన మరియు పనికి పంపించిన తల్లిదండ్రుల పైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్.ఐ.రమేష్ సూచించడం జరిగింది. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో పేరూరు పిఎస్ సివిల్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.