ప్రారంభమైన భోగి, సంక్రాంతి సంబరాలు
– ఆనందోత్సవాల మధ్య సంక్రాంతిని జరుపుకోవాలన్న వాజేడు మీడియా మిత్రులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ములుగు జిల్లా వాజేడు మండలం టీఎస్ మీడియా మిత్రులు శనివారం అందరూ సమావేశమై పరస్పరం పండగ శుభాకాంక్షలు తెలుపుకు న్నారు. తెలుగు వారీ పవిత్రమైన భోగి, సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా కొన్ని మీడియా సంస్థలకు సెలవును ప్రకటించడంతో మీడియా కుటుంబసభ్యులు, బందువులు, మిత్రులతో ఆనందంగా గడపాలని వారు ఆకాంక్షీంచారు. సకల జనులు అందరూ సుఖశాంతులతో, అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో కలిగి ఉండాలని, శుభాకాంక్షలు తెలుపు కుంటూ, తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలకు మేళవిం పైన భోగిమంటను ఆనందోత్సవాల మధ్య ఏర్పాటు చేసు కొని, ఆనందంగా పండుగను ఆనందోత్సవాల మధ్య ఆహ్వా నించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పాడి పంటల సస్య శ్యామలంగా, అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సకల జనులు సుఖశాంతులతో గడపాలని ఆకాంక్షిస్తూ భోగిమంట లతో వివిధ మీడియా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న సోద రులు భోగిమంటలతో తమ ఐక్యతను చాటుకొన్నారు. మనమంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వపరమైన హక్కులు సాధించుకుందాం అంటూ పండగ సందర్భంగా ప్రతిన పూనారు. సంక్రాంతి సందర్భంగాగౌర మండల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, సకల జనులకు,రైతులకు, సోదరీమణు లు కు , శ్రేయోభిలాషులకు, సహచర మీడియా కుటుంబ సభ్యులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.