స్వచ్ఛదనం పచ్చదనం మనందరి సామాజిక బాధ్యత

స్వచ్ఛదనం పచ్చదనం మనందరి సామాజిక బాధ్యత

స్వచ్ఛదనం పచ్చదనం మనందరి సామాజిక బాధ్యత

-లక్ష్మీదేవి పేట స్పెషల్ ఆఫీసర్ అల్వాల రవి, ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్           

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : మొక్కలు పెంచడం వల్ల సహజంగానే ప్రకృతి వరప్రసాదంగా మనమంతా ఉచితంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ ను పొందవచ్చు అంటూ స్వచ్ఛదనం పచ్చదనం అందరి సామాజిక బాధ్యత అని లక్ష్మీదేవి పేట స్పెషల్ ఆఫీసర్ అల్వాల రవి, లక్ష్మి దేవిపేట ప్రధానోపా ధ్యాయులు చంద్రశేఖర్ లు అన్నారు. శుక్రవారం వెంకటాపు రం మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రధాన రహదారి వెంట స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పంచాయతీ సెక్రటరీ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనం తరం స్పెషల్ ఆఫీసర్ రవి ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశే ఖర్లు మాట్లాడారు. స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలని, పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు విరాజిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద, పాఠశాలల చుట్టుపక్కల, కార్యాలయాల వద్ద, పొలాల వద్ద, ఖాళీ స్థలాలల్లో, రోడ్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టుకుందామని సూచించారు. మొక్కలు నాటడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు వర్షాలు విరివిగా కురిసి పాడి పంటలతో అందరూ సుఖసంతోషాలతో జీవిస్తారని ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా నర్సింగా పూర్ గ్రామపంచాయతీ ప్రధాన ఉపాధ్యాయులు సర్వేర్ అహ్మద్, పంచాయతీ కార్యదర్శి అనిత లక్ష్మీపురం పంచా యతీ కార్యదర్శి రజిత మొక్కలు నాటి ప్రజలకు చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్ర మంలో యుపిఎస్ ఉపాధ్యాయులు శైలేందర్, మాజీ సర్పంచ్ గట్టు కుమారస్వామి, కారబర్ గోసుకుల లక్ష్మణ్, ఏఎన్ఎం లు స్వర్ణలత ,వజ్ర,ఫీల్డ్ అసిస్టెంట్లు కేతిరి రాధిక ,నల్లబెల్లి భాస్కర్, సిఏలు గాజర్ల సరోజన ,స్వర్ణలత, ఆశా వర్కర్లు దిగిన సబితా, మధ్యల సంధ్య ,భానోత్ రజిని, ఇంచర్ల గీత, ఆశ వర్కర్లు కవిత, స్వాతి, జిపి సిబ్బంది మునిగాల రామకృష్ణ ,పాలకుర్తి సురేష్, బిరెల్లి తిరుపతి, గ్రామస్తులు చిర్ర గణేష్, నర్సింగాపూర్ అంగన్వాడి టీచర్ ఎర్రబెల్లి సరోజన, కరోబర్ కార్తిక్, ఆశ కార్యకర్త రాజ్యలక్ష్మి, సిబ్బంది స్వామి, లక్ష్మిపురం గ్రామపంచాయతీ సిబ్బంది లక్ష్మణ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.