షెడ్యూల్ తెగల వర్గీకరణ ద్వారానే నాయక పోడ్ అన్ని రంగాల అభివృద్ధి. 

Written by telangana jyothi

Published on:

షెడ్యూల్ తెగల వర్గీకరణ ద్వారానే నాయక పోడ్ అన్ని రంగాల అభివృద్ధి. 

– నాయక పోడ్ సాంస్కృతికి బడ్జెట్ కేటాయించాలి.

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి: ప్రపంచ ఆది వాసుల దినోత్సవం సందర్భంగా వెంకటాపురం మండల కేంద్రంలో నాయక్ పోడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలి నిర్వహిం చారు. ముఖ్య అతిథి గౌరవ అధ్యక్షుడు దబ్బ సుధాకర్ నాయక పోడ్, నాయకపోడ్ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు హాజరై జెండా ఆవిష్కరించి మాట్లా డారు. ఆదివాసి నాయక పోడ్ సంస్కతి లో ఎస్టీలలో చిన్న తెగలకు ఏ బి సి డి వర్గీకరణ ద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి సాదిస్తారనీ తెలిపారు. ఆదివాసి పోడుదెబ్బ జెండా ఆవిష్కరణ కార్యక్రమ రెవెన్యూ కార్యాలయం ముందు ఎగురవేశారు. ములుగు జిల్లా కో ఇంచార్జ్ గుర్రం రామారావు ఆధ్వర్యంలో ఈకార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు.  కోఆర్డినేటర్ నెమలి నర్సయ్యమాదిగ కూడ పాల్గొన్న రు. మాదిగ దండోరా ఏ బి సి డి వర్గీకరణ పోరాటం 30 సంవత్సరములు పూర్తి చేసుకొని, సుప్రీంకోర్ట్ ఎస్సీ, ఎస్టీలకు వర్గీకరణతోనే సామాజిక న్యాయం పూర్తిగా అమలవుతుందని , తీర్పురావడం అభినందనీయమని, అంతటి కృషి చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఖకు అభినం దనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటు వంటి సమావేశంలో సుధాకర్ నాయక పోడ్ మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను తీసుకొచ్చి నిమ్న కులాలకు రిజర్వేషన్లు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  రిజర్వేషన్లు చిట్టచివరి పేదవానికి కూడా విద్యా, ఉద్యోగ, సంక్షేమ,ఉపాధి, రాజకీయ రంగాలలో ప్రజలకు, ప్రజ స్వామ్యవాదులకు మేధావులకు అందేవిధంగా క్రుషీ చేయా లనీ పిలుపునిచ్చారు. మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు వావిలాల స్వామి మాదిగ ,గండెపల్లి నర్సయ్య, ఆదివాసి నాయక పోడ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు నూగురు గ్రామ పెద్దలు బండి కృష్ణ నాయక పోడ్,ఇండ్ల లక్ష్మీనారాయణ, దెబ్బ ఉద్యోగుల సమాఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ బానారి బాలకృష్ణ నాయక పోడ్, పోలెం శ్రీను, నగేష్ నాయక పోడ్, సామాజిక న్యాయ కృతజ్ఞతలతో పోలేం శ్రీను నాయక పోడ్,  ఆదివాసి నాయక పోడ్ వెంకట పురం మండల నాయకులు,సోనీ కార్తీక్, నాయక పోడ్, బానారి సురేష్, బానారి రాణి, ప్రభావతి, బానారి నర్సమ్మ, ఉమ్మడి నరసింహయ్య, బానారి శ్రీనువాస్, బాణాల సమ్మయ్య ,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment