విధ్యార్ధుల చే మట్టి వినాయక విగ్రహాల తయారీ
విధ్యార్ధుల చే మట్టి వినాయక విగ్రహాల తయారీ
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వాజేడు నాగరంలో, పాఠశాల విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలు ను శుక్రవారం తయారు చేశారు. పర్యావరణ హిత వినాయక విగ్రహాలు, ప్రకృతిని పరిరక్షిస్తాయని, విషపూరిత కృత్రిమ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలు పర్యావర ణానికి, ప్రకృతికి, జలచరాలకు, మనుష్యులకు హాని కలిగిస్తా యని ఆంగ్ల ఉపాధ్యాయులు చల్లగురుగుల మల్లయ్య అన్నా రు. విద్యార్థి దశలోనే హానికార క విషపూరిత కృత్రిమ రంగులు వాడిన విగ్రహాల వలన కలిగే హాని గురించి విద్యార్థు లు కు అవగాహన కోసం, బంక మట్టితో శ్రీ వినాయక ప్రతిమ లు తయారు చేయించి, పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వాజేడు మండల విధ్యాధికారి టి.వెంకటే శ్వర రావు సందర్శించి, విద్యార్థులు తయారు చేసిన వినాయ క విగ్రహాలను చూసి,విద్యార్థులను అభినందించారు.ఈ కార్య క్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పోరిక స్వరూప్ సింగ్ మాట్లాడుతూ విద్యార్జి దశనుంచే పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన చాలా అవసరమని అందుకోసం విద్యార్థులకు చైతన్యం కలిగిస్తున్న చల్ల గురుగు ల మల్లయ్య కృషిని కొనియాడారు. అంతేకాకుండా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, పర్యావరణ హిత కలుషిత రహిత ఆహ్లాద భరిత ప్రకృతిని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగు ఆనంద్,నూనావత్ శ్రీకాంత్,రాజేష్ షిండే, కోకిల శ్రీరంగం,జర్పుల వస్య తదితరులు పాల్గొన్నారు.